దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి మృతి: ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన

  • ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు
  • ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వెల్లడి
  • ఇరాన్ కీలక నేతల వేట కొనసాగుతుందన్న కాట్జ్
ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ తమ దాడుల్లో హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులు కొనసాగిస్తోంది. ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇస్మాయిల్ ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఖతీబ్ మృతిని ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ కీలక నేతల వేట కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఇరాన్ కీలక అధికారులు లక్ష్యంగా దాడులు చేయడానికి, వారిని హతమార్చడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని కాట్జ్ తెలిపారు.

యుద్ధం ప్రారంభం రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అలీ లారిజానీ హతమయ్యారు. తాజాగా ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలీ ఖమేనీకి ఇస్మాయిల్ ఖతీబ్ అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది.

Ismail Khatib
Iran
Israel
IDF
Katz
Benjamin Netanyahu
Ali Khamenei
Ali Larijani
Intelligence Minister

More Telugu News